ఖానాపూర్: మండలంలోని దిల్వార్పూర్ పరిధిలోగల పీఏసీఎస్ వరి కొనుగోలు కేంద్రాన్ని గురువారం అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, సెక్రటరీ నబీఖాన్‌తో కొనుగోళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రస్తు తం కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని సూచించారు. లారీల సంఖ్య పెంచి ధాన్యం తరలింపులో జాప్యం లేకుండా చూడాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


