రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ● కొనుగోలు కేంద్రాల పరిశీలన

కుంటాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పేర్కొన్నారు. గురువారం మండలంలోని అర్లి(కె) శ్రీఆంజనేయ రైస్‌ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం కల్లూరులోని మొక్కజొన్న, జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. లారీ లు, హమాలీల కొరత లేదని రైతులు అసహనానికి గురికావద్దని సూచించారు. చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అనంతరం కల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ధాన్యం నిల్వలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్‌ 7లోపు కొనుగోళ్లు పూర్తిచేయాలని, కేంద్రాల్లోని నిల్వలను సకాలంలో గోదాములకు తరలించి అన్‌లోడింగ్‌ చేయాలని సూచించారు. మండలంలోని పెంచికల్‌పాడ్‌ గ్రామంలో గోదాంకు అవసరమయ్యే ఐదెకరాల ప్రభుత్వ స్థలం ఉందని, నిర్మాణం కోసం వెంటనే పరిశీలించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. జిల్లాలోని లోకేశ్వరం, సారంగపూర్‌, దస్తురాబాద్‌ మండలాల్లో కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌కుమార్‌, పౌరసరఫరాలశాఖ అధికారి రాజేందర్‌, సుధాకర్‌, తహసీల్దార్‌ కమల్‌సింగ్‌, ఎంపీడీవో వనజ, సర్పంచులు పెంటవార్‌ దశరథ్‌, చంద్యాల మురళి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సట్ల గజ్జారాం తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement