న్యూస్‌రీల్
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిన కేంద్రం రూ.150 నుంచి రూ.400 వరకు పెంపు.. ఎంఎస్‌పీ పెంపు నామమాత్రమే..
అందుబాటులోలేని ఎమ్మెల్యేలు.. అసలే రాని ఎంపీ, ఎమ్మెల్సీలు తమ కష్టం పట్టేదెవరికంటూ రైతుల ఆవేదన
వరి సాగుచేసే రైతులు సాధారణంగా ఎకరా కు 10:26:26 రెండు బస్తాలు, యూరియా రెండు బస్తాలు వాడతారు. 10:26:26పై బ స్తాకు రూ.300 చొప్పున రూ.600 పెరిగింది.
పత్తి సాగు చేసే రైతులు ఎకరాకు 12:32:16 రెండు బస్తాలు, 20:20:0:13 ఒక బస్తా, యూరియా రెండు బస్తాలు వాడతారు. 12:32:16పై బస్తాకు రూ.400 చొప్పున రూ.800 భారం పడుతుంది. 20:20:0:13పై రూ.150 కలిపి మొత్తం రూ.950 భారం పడుతుంది.
మొక్కజొన్న సాగుచేసే రైతులు సాధారణంగా 14:35:14 ఒక బస్తా, యూరియా రెండు బస్తాలు వాడతారు వీరిపై రూ.350 అదనపు భారం పడుతుంది.
సోయాబీన్ రైతులు పంటకు 12:32:16 ఒక బస్తా, డీఏపీ ఒక బస్తా వినియోగిస్తారు. 12:32:16పై రూ.400 పెరిగినందున ఆ భారం రైతుపై పడుతుంది.
ఆధునికీకరణకు నోచుకోని ‘సరస్వతి’
ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో ఒకటైన సరస్వతి కెనాల్ ఆధునికీకరణకు నోచుకోక చివరి
ఆయకట్టుకు నీరందడం లేదు.
తహసీల్దార్‌కు పదోన్నతి
నిర్మల్‌చైన్‌గేట్:రాష్ట్రంలో పలువురు తహసీల్దార్లను పదోన్నతిపై బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో నిర్మల్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఏ.మోతీరాంకు డీఆర్వోగా పదోన్నతి కల్పించి మంచిర్యాలకు బదిలీ చేశారు.
రేపు కార్గో వస్తువుల వేలం
నిర్మల్‌టౌన్: ఆర్టీసీ నిర్మల్ డిపో కార్గోలో తీసుకెళ్లని పాత వస్తువులను ఈ నెల 29న డిపో ఆవరణలో వేలం వేయనున్నట్లు డీఎం కె.పండరి తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉదయం 11 గంటలకు వేలంలో పాల్గొనాలని సూచించారు.
భైంసాలో ఫ్లాగ్‌మార్చ్
భైంసాటౌన్:పట్టణంలో బుధవారం సాయంత్రం పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఏఎస్పీ సాయికిరణ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా బలగాలతో కవాతు చేపట్టారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సాయికుమార్, ఎస్సైలు, పోలీసులు పాల్గొన్నారు.
భైంసా.ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతు నెత్తిన పిడుగుపడింది. ఇప్పటికే యాసంగి పంట అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కేంద్రం కాస్త ఊరట నిచ్చేలా 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. అయితే ఈ పెంపు చాలా తక్కువగా ఉండడంతో చాలా మంది పెదవి విరిచారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను 50 కేజీల బస్తాకు రూ.150 నుంచి రూ.400 వరకు పెంచేసింది. మద్దతు ధర పెంపు క్వింటాలుకు రూ.72 నుంచి రూ.622 మాత్రమే. ఎకరాకు లెక్కేస్తే రైతుకు వచ్చే అదనపు ఆదాయం కన్నా ఎరువులకే అయ్యే అదనపు ఖర్చు రెట్టింపు అవుతోంది.
జిల్లా పరిస్థితి.....
జిల్లాలో ఖరీఫ్‌లో 1.82 లక్షల ఎకరాల్లో వరి, 1.35 లక్షల ఎకరాల్లో పత్తి, 68 వేల ఎకరాల్లో సోయా, 42 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ సీజన్‌లో రైతులపై అదనంగా రూ.38 కోట్ల ఎరువుల భారం పడుతుంది. ఎంఎస్‌పీ పెంపుతో వచ్చే అదనపు ఆదాయం రూ.112 కోట్లు. డీజిల్ లీటరు రూ.3, కూలీ రోజుకు రూ.100 పెరగడంతో ఆ మిగులు కూడా కరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ‘క్వింటాలుకు రూ.72 పెంచి ఎరువు బస్తాకు రూ.400 పెంచితే ఎలా బతకాలి అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట చేతికి వచ్చాక తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 3–4 కేజీలు కోత పెడుతున్నారని పేర్కొంటున్నారు.
బాధ్యులపై చర్య తీసుకోవాలి
కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు రూ.లలో
ఎరువు పాత ధర కొత్త ధర పెంపు
10:26:26 1850 1,975 125
12:32:16 1,475 1,875 400
14:35:14 1,500 1,850 350
20:20:0:13 1,500 1,800 300
డీఏపీ 1,350 1,350 మార్పు లేదు
28:28:0 1,500 1,800 300
పొటాష్ 1,850 1,975 1215
సూపర్ 615 775 160
పంటల వారీగా కొత్త ఎంఎస్‌పీ
(క్వింటాల్‌కు)రూ.లలో..
పంట పాత ధర కొత్త ధర పెంపు
వరి(సాధారణ) 2,369 2,441 72
వరి(గ్రేడ్–ఏ) 2,389 2,461 72
మొక్కజొన్న 2,329 2,401 72
పత్తి(మధ్యశ్రేణి) 7,710 8,267 557
పత్తి(దీర్ఘశ్రేణి) 8,110 8,667 557
సోయాబీన్ 4,892 5,284 392
కంది 7,550 8,415 865
జిల్లా రైతుపై భారం(ఎకరా లెక్కన)


