పిప్రికి సాగు నీరందించాలి | - | Sakshi
Sakshi News home page

పిప్రికి సాగు నీరందించాలి

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

లోకేశ్వరం: పిప్రి ఎత్తిపోతల పథకం ద్వార పిప్రి గ్రామానికి సాగు నీరందించేలా చూడాలని గ్రామస్తులు, ఎత్తిపోతల పథకం కమిటీ సభ్యులు ఇరిగేషన్‌ కార్యాలయంలో డీఈఈ అనిల్‌ను కోరారు. ఈమేరకు బుధవారం కలిసి సమస్యలను వివరించారు. గ్రామ శివారు ప్రాంతంలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలన్నారు. పిప్రి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసిన తర్వాతనే మిగతా పనులు చేస్తామని అనిల్‌ హామీ ఇచ్చారు. సర్వే ప్రకారంగా 8 డీసీ లను నిర్మించి 557 ఎకరాలను సాగు నీరందిస్తామన్నారు. కార్యక్రమంలో పిప్రి వీడీసీ చై ర్మన్‌ జీవరత్నం, ఉపాధ్యక్షుడు రంజిత్‌, క్యాషి యర్‌ మగ్గిడి రాజు, ఎత్తిపోతల పథకం చైర్మన్‌ బందు, సభ్యులు చిన్నయ్య, పాపయ్య, నరేశ్‌గౌడ్‌, భోజన్న, రమేశ్‌, ముత్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement