నేడు బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు బక్రీద్‌

May 28 2026 2:04 AM | Updated on May 28 2026 2:04 AM

● మసీదులు, ఇద్గాలు ముస్తాబు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు

ఉట్నూర్‌రూరల్‌/కెరమెరి/నెన్నెల: ఇస్లాం ప్రకారం ముస్లింలకు ముఖ్యమైన పండుగల్లో బక్రీద్‌ రెండోది. ఇబ్రహీం చేసిన నిరుపమాన త్యాగానికి ప్రతీ కగా ఏటా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మసీదులు, ఈ ద్గాలు ముస్తాబు చేశారు. గురువారం బక్రీద్‌ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పా ట్లు చేశారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెలలో 10వ రోజున బక్రీద్‌ పండుగను ఇబ్రహీం త్యా గాన్ని తలుచుకుంటారు. ఇదేరోజు మక్కా నగరంలో హజ్‌ ఆరాధనోత్సవం జరుగుతుంది. మక్కా వెళ్లే స్థోమత లేనివారు ఉన్న చోటే ప్రత్యేక నమాజ్‌ చేసి ఖుర్బానీ ఇస్తారు. బుధవారం జిల్లా కేంద్రాలు, మున్సిపాల్టీలు, మండలాల్లో ఈద్గా వద్ద ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement