రాళ్ల వాన బీభత్సం.. | - | Sakshi
Sakshi News home page

రాళ్ల వాన బీభత్సం..

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

తానూరు: మండల కేంద్రమైన తానూరుతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం రాళ్లవాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈదురు గాలులతో వాన కురిసింది. ఝరి(బి), బెంబర, బోరిగాం గ్రామాల్లో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయాయి. బోల్సా, ఉమ్రి(కే), బోరిగాం గ్రామాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో ఉమ్రి(కె), బోరిగాం, ఝరి(బి), వడ్‌ఝరి(బి) గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తానూరు గోదాంకు లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చిన మొక్కజొన్న పంట తడవకుండా చూసేందుకు హమాలీలు, రైతులు తిప్పలు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement