ఖానాపూర్‌లో.. | - | Sakshi
Sakshi News home page

ఖానాపూర్‌లో..

May 27 2026 1:05 AM | Updated on May 27 2026 1:05 AM

ఖానాపూర్‌: పట్టణంతో పాటు మండలంలో ని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి కురి సిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తరలింపులో జాప్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈదు రు గాలుల ధాటికి పలుచోట్ల విద్యుత్‌ స్తంభా లు విరిగిపడ్డాయి. వృక్షాలు కూలిపోయాయి. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌ శివారులో కొత్త ప్లాట్ల కాలనీలో విద్యుత్‌ స్తంభం విరిగి రోడ్డుపై పడింది. మండలంలోని మస్కాపూర్‌ గ్రామంలో ఇగ్లూ థియేటర్‌ ముందు విద్యుత్‌ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి, అక్కడే చెట్ల కొమ్మలు కూడా విరిగిపోయాయి. పట్టణంలోని పలు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోని దుకాణాల బోర్డులు కొట్టుకుపోయా యి. కొన్ని ఇళ్లపై వాటర్‌ ట్యాంకులు, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులపై నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. పట్టణంలోని శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో నివాసముంటున్న బోగు రవి ఇంటి పైకప్పు కొట్టుకుపోవడంతో రవితోపాటు అతని భార్య హేమలత, కుమారుడు నందు గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement