ఖానాపూర్: మండలంలోని సుర్జాపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారులు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు సోమవారం ఆందోళన చేశా రు. ధాన్యం తూకం వేసేందుకు రూ.50 హమాలీ చార్జీ వసూలు చేస్తున్నారని, లారీలలో ధాన్యం బస్తాలను తరలించేందుకు ఒక్కో బస్తాకు రూ.5 డిమాండ్ చేస్తున్నారని రైతులు తెలిపారు. 20 రోజులుగా కేంద్రం నుంచి ఒక్క ధాన్యం బస్తా కూడా తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాళ్లు మొక్కుతాం.. మా ధాన్యం సమస్యను వెంటనే పరిష్కరించండి’ అంటూ అక్కడికి వచ్చిన అధికారులను వేడుకున్నారు. డీఆర్డీవో విజయలక్ష్మి ఫోన్‌లో రైతులతో మాట్లాడారు. ఐకేపీ సీసీని మార్చడంతోపాటు ఆర్‌ఐ నాగేష్ ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు.
సుర్జాపూర్‌లో అదనపు వసూళ్లు..


