వరి ధాన్యం తరలింపు
పెంబి: మండలంలోని మందపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో తూకం నిలిచిపోయింది. దీనిపై కొను‘గోడు’ పట్టదా.. శీర్షికన ‘సాక్షి’లో కథ నం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధి కారులు సోమవారం నాలుగు లారీలు, డీసీ ఎంలో దాదాపుగా మూడు వేలకుపైగా ధా న్యం బస్తాలు తరలించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సాక్షికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
బక్రీద్‌కు ఏర్పాట్లు
నిర్మల్‌టౌన్: బక్రీద్‌కు మున్సిపల్ ఆధ్వర్యంలో ముస్లింల ప్రార్థనల కోసం ఈద్గా వద్ద ఏ ర్పాట్లు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి తెలిపారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను కౌన్సిలర్లతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈద్గా వద్ద పరిశుభ్రత, నీటి సరఫరా, వీధి దీపాలు, శాని టేష్ పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వేసవి ని దృష్టిలో ఉంచుకుని దాదాపు 16 చోట్ల తాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ప్రజలకు ఎక్కడా అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పండ గ వేళ ముస్లింలకు ఇబ్బందులు లేకుండా చే ర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, ఇర్ఫాన్, జాకీ, ఫెరోజ్, రఫీ, ముజాహిద్ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ అస్లాం, డీఈ హరిభువన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులపై చర్య తీసుకోవాలి
నిర్మల్‌రూరల్: భైంసా పట్టణంలోని మదీనా కాలనీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తపస్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ డిమాండ్ చేశారు. సంఘం నాయకులతో కలిసి సోమవారం డీఈవో భోజనకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడినవారిని శిక్షించాలని కోరారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ తదితరులు ఉన్నారు.
నాణ్యమైన పాలు అందించడమే లక్ష్యం
మామడ: నాణ్యమైన పాలు, పెరుగు విని యోగదారులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు అన్నారు. మండలంలో ని పొన్కల్ గ్రామంలో డెయిరీ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడిపరిశ్రమను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డెయిరీ జగిత్యాల్ జిల్లా మేనేజర్ లక్ష్మీపతి, సేల్స్ ఏజీఎం విష్ణు, సూపర్‌వైజర్ రమేశ్, చందు, స్థానిక నాయకులు రాజారెడ్డి, వంశీ, వినియోగదారులు పాల్గొన్నారు.
29 నుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్–2026 అడ్మిషన్లకు సంబంధించి ఈనెల 29 నుంచి జూన్ 1 వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ప్రిన్సిపాల్ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాంకు సాధించిన విద్యార్థులు ఈనెల 27 నుంచి 31 వరకు నిర్ణీత రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు నిర్ణయించిన తేదీ, సమయానికి గంట ముందుగానే నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరుకావాలని సూచించారు. తమ వెంట పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికెట్లు, ఎస్‌ఎస్‌సీ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది జనవరి 1 తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులు పదేళ్ల నివాస ధ్రువపత్రం తెచ్చుకోవాలని పే ర్కొన్నారు. మిగతా వివరాలకు 90102 22174, 9948156588 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


