నిర్మల్‌ జిల్లా ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ జిల్లా ఆదర్శం

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

● సీఎం రేవంత్‌రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళి క’’ మహిళా వారోత్సవాల్లో భాగంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అభివృద్ధి కా ర్యక్రమాలకు సీఎం సోమవారం వర్చువల్‌ వి ధానంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో నిర్మల్‌ జిల్లా మహిళలను అభినందించారు. బ్యాంకు లింకేజీ, రుణ వసూ ళ్ల సాధనలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంద ని సీఎం ప్రశంసించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణితో మాట్లాడి, జిల్లాలో మహిళా సంఘాల పనితీరును అభినందించారు. మళ్లీ జిల్లాకు వచ్చినప్పుడు నేరుగా కలుస్తానని తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా పాల్గొన్నారు. సమావేశం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామ ని పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళా సంఘాల సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement