నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ భవేశ్‌మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సో మవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించా రు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ స మస్యలకు సంబంధించి 56 దరఖాస్తులు వచ్చా యి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరి శీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూ చించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు బి వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, భైంసా సబ్‌కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కలెక్టరేట్ ప్రాంగణంలో జూన్ 02న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ప్రతిష్టాత్మకంగా, ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్, ప్రధాన వేదికను పూలతో అందంగా ముస్తాబు చేయాలన్నారు. వేడుకలకు ప్రొటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానించాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు సరిపడా సీటింగ్ వేయాలని, ఏర్పాట్లలో లోటు రాకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిశోర్‌కుమార్, ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, ఆర్డీవో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.


