ఆగని పెట్రో బాదుడు | - | Sakshi
Sakshi News home page

ఆగని పెట్రో బాదుడు

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

● 10 రోజుల్లో నాలుగుసార్లు పెంపు ● సామాన్యుల జీవనం మరింత భారం ● ఇబ్బంది పడుతున్న వాహనదారులు

నిర్మల్‌టౌన్‌: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత్వంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. చమురు సంస్థలు పది రోజుల వ్యవధిలో నాలుగుసార్లు ధరలు పెంచాయి. వరుస పెంపుతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పది రోజుల్లో నాలుగు సార్లు..

మే 15న లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3, మే 19న 90 పైసలు, మే 23న పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచాయి. తాజాగా మే 25న డీజిల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 వరకు పెంచాయి. మంత్తంగా పరది రోజుల్లో రూ.8 వరకు పెట్రో ధరలు పెరిగాయి. జిల్లాలో ప్రస్తుతం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.117 ఉండగా, డీజిల్‌ ధర రూ.103కు చేరింది.

నిత్యావసరాలపై ప్రభావం..

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడంతో ధరలు పెట్రో ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈ ప్రభావం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తున్నాయి. రవాణా చార్జీలు కూడా పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే వంటగ్యాస్‌ ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు హోటళ్లలో అల్పాహారం, భోజనాల ధరలు కూడా భారంగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement