కుభీర్: కుభీర్ ఉన్నత పాఠశాలలో 1995–96 లో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. వివిధ వృత్తుల్లో స్థిర పడిన పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో హా జరయ్యారు. చిన్ననాటి స్నేహితులను పలకరించారు. పరిచయం చేసుకున్నారు. తమకు వి ద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎర్రన్న, గంగాధర్, వెంకటేశ్వర్, నాగమణి, లింగన్న ను సన్మానించారు. పాదాభివందనం చేసి ఆ శీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం వర కు సరదాగా ఆట పాటలతో గడిపారు. అప్ప టి విధ్యార్థులలో ఎల్.అరవింద్(టీచర్), బషీ ర్(మాజీ ఎంపీటీసీ), శ్రీకాంత్(ప్రముఖ వ్యా పారి), దశరథ్, లింగన్న, అప్సర్, అహూఫ్ తదితరులతోపాటు 90 మంది పాల్గొన్నారు.


