నిర్మల్‌టౌన్: అరుదైన వైద్య సేవలతో ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్న జిల్లా కేంద్రానికి చెందిన వైద్య దంపతులు నాళం స్వప్న–శశికాంత్ హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ చేతులమీదుగా ఈ పురస్కారాలు అందుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ స్వప్న చిన్నపిల్లల వైద్యురాలిగా, డాక్టర్ శశికాంత్ జనరల్ సర్జన్‌గా సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే చేసే శస్త్ర చికిత్సలను నిర్మల్‌లోనే చేయడం, పేషెంట్లకు దూర భారం, అలాగే వ్యయ భారాన్ని తగ్గించడంతో వీరు పురస్కారాలకు ఎంపికయ్యారు.


