సారంగపూర్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీఅడెల్లి మహాపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని దర్శించుకో వడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలు మూలలతోపాటు పొరుగు జిల్లాలైన నిజా మాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరా బాద్, మెదక్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే తాగునీరు దొరకక కొంత ఇబ్బంది పడ్డారు. ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


