జిల్లాలో వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 46.5 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదవుతున్నాయి. తీవ్రమైన వేడితో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆస్పత్రిలో పిల్లలు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. సరైన గాలి వ్యవస్థ లేకపోవడంతో ఉక్కపోతకు గురవుతున్నారు. వార్డుల్లో గాలి ఆడక చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నారు. కొందరు ఫ్యాన్ గాలి సరిపోక సొంతంగా ఇళ్ల నుంచి కూలర్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న కూలర్లు అలంకారప్రాయంగానే ఉన్నాయి. చల్లని తాగునీరు అందించే వాటర్ కూలర్ పనిచేయడం లేదు. దీంతో చల్లటి నీటిని కూడా బయట కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
అలంకార ప్రాయంగా ఉన్న
ఆస్పత్రి కూలర్
మాతాశిశు ఆస్పత్రిలో ఇంటి నుంచి తెచ్చుకున్న కూలర్, వాటర్ క్యాన్
పసిపాపకు గాలి విసురుతున్న అమ్మమ్మ


