ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

భైంసాటౌన్‌: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విస్తృతంగా పనిచేయాలని ఆ పార్టీ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ క్రిషాంక్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలో మీట్‌అండ్‌గ్రీట్‌ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముధోల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కన్వీ నర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విస్మరిస్తోందన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందన్నారు. ఇందుకనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికార కాంగ్రెస్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడినా, కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్తలు విలాస్‌ గాదేవార్‌, కిరణ్‌ కొమ్రేవార్‌, లోలం శ్యాంసుందర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement