నిర్మల్‌టౌన్: నాలుగైదు రోజులుగా తీవ్ర ఎండల కారణంగా జిల్లా కేంద్రంలోని రోడ్లపై, బస్టాండ్‌లో నివసిస్తున్న నిరాశ్రయ యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఎస్పీ జానకీషర్మి ల పట్టణంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగా బస్టాండ్లు, ప్రజా ప్రదేశాల్లో ఆశ్రయం లేకుండా జీవిస్తున్న భిక్షాటనదారులను గుర్తించి వారికి అవసరమైన సహాయం అందించారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొంతమంది నిరాశ్రయులను ఓల్డ్ ఏజ్ హో మ్‌లకు తరలించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ సమ్మయ్య, ఎస్సై జ్యోతిమణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


