విద్యతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే అభివృద్ధి

May 23 2026 12:04 AM | Updated on May 23 2026 12:04 AM

భైంసాటౌన్‌: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పి రామారావు పటేల్‌ అన్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పట్టణంలోని ఎస్‌ఎస్‌ కాటన్‌ ఫ్యాక్టరీలో అనసూయ పవార్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సత్కరించి జ్ఞాపిక అందించారు. విద్యార్థులు బాగా చదవి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏటా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ తూమోల్ల దత్తాత్రి, రాజేశ్‌బాబు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement