లక్ష్మణచాంద: రైతులు ఆందోళన చెందవద్దని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. వడ్యాల్, పీచర, పార్‌పెల్లి, లక్ష్మణచాంద గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట ఉత్పత్తులను పరిశీలించి,అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పంటను అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సక్రమంగా జరిగేలా చూడాలని, సేకరించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు త్వరగా జరిగేలా అధికారులు చొరవ చూపాలని కోరారు. ఆయన వెంట సురేందర్‌రెడ్డి, వడ్యాల్ సర్పంచ్ నరేశ్, నాయకులు నరేశ్‌రెడ్డి, మేకల రాజేందర్, సురేశ్‌రెడ్డి, సుదర్శన్, కేశం రమేశ్, గంగారం, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


