కడెం: మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతుల పామాయిల్ చెట్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయి. వివరాలు.. గ్రామానికి చెందిన కొంపెల్లి రవీందర్ రెండెకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాడు. తోట పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ వద్ద బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో తోటకు నిప్పంటుకుని 25చెట్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మరో రైతు కడారి సంజీవ్ తోటలోని ఐదు పామాయిల్ చెట్లు కాలిపోయాయి. గురువారం ఉద్యాన అధికారి స్పందన, ఆర్‌ఐ శారద కాలిన చెట్లను పరిశీలించారు. పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.


