ఖానాపూర్: బక్రీద్ నేపథ్యంలో పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ బు ధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని సూచించారు. చిన్న ఘట నలను సోషల్ మీడియాలో పెద్దగా చూపి ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సి పల్ అధికారులు పారిశుద్ధ్యం, క్లీనింగ్, వ్యర్థాల తొ లగింపు పనులు పకడ్బందీగా నిర్వహించాలని సూ చించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవా లని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అంకం మౌనిక మహేందర్, సీఐ అజయ్, ఎస్సై రాహుల్ గైక్వాడ్, వైస్ చైర్‌పర్సన్ షోయబ్, డిప్యూటీ తహసీల్దార్ మంజుల, ఏడీ రామచంద్రుడు, ఎంపీవో రత్నాకర్‌రా వు, కౌన్సిలర్లు, నాయకులు సత్యవతి, ఇందిరా, జ హీర్ అహ్మద్, సురేశ్, సతీశ్, ప్రకాశ్‌గౌడ్ ఉన్నారు.


