ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన | - | Sakshi
Sakshi News home page

ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన

May 21 2026 12:14 AM | Updated on May 21 2026 12:14 AM

భైంసాటౌన్‌: ప్రతీ ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉండాలని ఎస్పీ జానకీ షర్మిల ఆదేశించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవా రం ప్రజావాణి నిర్వహించారు. డివిజన్‌ పరిధి లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదా రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఎదుటే సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో మా ట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించా రు. కుటుంబ కలహాల నేపథ్యంలో వచ్చిన త ల్లి, కొడుకులతో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడా రు. పరస్పర అవగాహనతో సమస్యలు పరి ష్కరించుకోవాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రంలో షీటీం సేవలను పరిశీలించారు. కుటుంబ సమస్యలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. పెండింగ్‌ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement