నిర్మల్‌ఖిల్లా: ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివి జన్) ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పా ర్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ప్రక్రియ
పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ.. జూన్ 25నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రతీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున బూత్ లెవెల్ ఏజెంట్లను ని యమించాలని సూచించారు. అర్హులెవరూ ఓటు హ క్కు కోల్పోకుండా, పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చే స్తామని చెప్పారు. అనంతరం తహసీల్దార్లు, అధికా రులతో సమావేశమై పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అ జ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, ఖానా పూర్ ఈఆర్‌వో గంగాధర్ తదితరులున్నారు.
అర్హులందరికీ పని కల్పించాలి
అర్హులందరికీ పని కల్పించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ సూచించారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి సె ర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో కలిసి కలెక్టర్లు, గ్రా మీణాభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. పనులు వేగవంతం చే యాలని, ప్రణాళికలోని అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. ఎండ తీవ్రం కాకముందే పనులు ముగించి ఇళ్లకు చేరుకోవాలని, కూలీలకు అన్ని వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీ వో విజయలక్ష్మి, డీపీవో శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


