లక్ష్మణచాంద మండలంలోని కనకాపూర్ ప్రధాన రహదారి చింతల్‌చాంద, చామన్‌పెల్లి, రాచాపూర్, పోటపెల్లి, వడ్యాల్, కనకాపూర్ గ్రామాల వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్ల మేరకు ఉండగా రోడ్డుకు ఇరువైపులా వరి ధాన్యమే కనిపిస్తోంది. 15–20 రోజులుగా రైతులు 43 డిగ్రీల ఎండలో ధాన్యం ఆరబోస్తూ అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలు, సంచుల కొరత ఉండగా సకాలంలో కొనుగోళ్లు జరగక రోడ్లపైనే రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. కాగా, పిల్లలు కూడా సంచుల్లో ధాన్యం నింపుతూ తల్లిదండ్రులకు సాయపడుతుండడం విశేషం.. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్


