నిర్మల్‌టౌన్: ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలను ని షేధించాలని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బాధ్యులు కోరారు. ఆన్‌లైన్ అమ్మకాల ప్రభావంతో కనీసం మెడికల్ షాపుల అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ షాపుల బంద్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ షాపుల యజమానులు ర్యాలీగా వెళ్లి ఆర్డీవో రత్నకళ్యాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో పైనుంచి మంచి కంపెనీల పేరిట మోసం చేస్తూ.. ఔషధాలు సరఫరా చేయడంతో కింది స్థా యిలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్స్ బలవుతున్నారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు మాత్రం నేరుగా అధిక డిస్కౌంట్‌తో మందులు ఇవ్వడంతో మెడికల్ షాప్ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికై నా తమ సమస్యలు పరిష్కరించాలని షాపుల యజమానులు కోరారు.


