ఆర్జీయూకేటీలో జాతీయ ఓటరు దినోత్సవం
బాసర: బాసర ఆర్జీయూకేటీలో శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అనే నినాదంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రజా స్వామ్య వ్యవస్థలో యువత పాత్ర కీలకమని, నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని అన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ విద్యార్థులు, అధ్యాపకులతో ‘నిష్పక్షపాతంగా ఓటు వేస్తాం‘ అని ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఓటరుగా నమోదు చేసకోవాలని సూచించారు. ఫారం–6పై అవగాహన కల్పించారు.


