ప్రాజెక్టుల పేరు మార్చాలె..!
న్యూస్‌రీల్
‘స్వర్ణ’కు నర్సన్నబాపు పేరు.. సదర్మాట్‌కు పరిశీలనలో పలుపేర్లు డిమాండ్‌లో నాగమ్మ, వైఎస్సార్, జగన్నాథరావు త్వరలోనే తేలుస్తామంటున్న నేతలు
నిర్మల్
I
సరస్వతీ
నమస్తుభ్యం
‘ఆదర్శ’ విద్యార్థులను అభినందించిన మంత్రి
కుంటాల: హైదరాబాద్ గడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో కుంటాల ఆదర్శ పాఠశాల విద్యార్థులు దివ్య, నాగజ్యోతి మ్యాథమెటిక్స్ పై సంఖ్యలు, పరిమాణాలు, ఆధారాలు, వాటి మధ్య సంబంధాలపై ప్రాజెక్టును ప్రదర్శించారు. విద్యార్థులను గైడ్ టీచర్ రమాదేవి, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, విద్యాశాఖ కార్యదర్శి నికోలాస్, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి అభినందించారు.
నిర్మల్: జిల్లా కేంద్రంలో ఈనెల 16న నిర్వహించిన బహిరంగసభలో సదర్మాట్ బ్యారేజీకి పి.నర్సారెడ్డి, ఆదిలాబాద్‌లోని చనాక–కొరాటా బ్యారేజీకి సి.రాంచంద్రారెడ్డిపేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనపై అప్పటికప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తమైనప్పటికీ.. స్థానికంగా వ్యతిరేకత మొదలైంది. తాము ఆశించిన విధంగా ఈపేర్లు పెట్టలేదన్న వాదన పెరుగుతోంది. స్థానిక నేతలు, వీడీసీలు వెంటనే ప్రాజెక్టుల పేర్లు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
‘స్వర్ణ’కు నర్సారెడ్డి పేరు..
సీనియర్ కాంగ్రెస్ నేత పి.నర్సారెడ్డి (నర్సన్నబాపు ) స్వగ్రామం సారంగపూర్ మండలం మలక్‌చించో లి. గోదావరి ఉపనది స్వర్ణపై ప్రాజెక్టు నిర్మించా రు. ఆయన మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా జిల్లా అభివృద్ధికి కీలకంగా నిలిచారు. స్థానికులు చాలా కాలంగా స్వర్ణ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని కోరుకుంటున్నారు. సదర్మాట్ ప్రకటనతో మామడ, సారంగపూర్ మండలాల వాసులు నిరాశ చెందుతున్నారు.
సదర్మాట్‌కు పలు పేర్లు..
పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మాట్ బ్యా రేజీ యాసంగి పంటలకు నీరు అందిస్తోంది. ఈ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు సరిపోదని, ప్రాజెక్టు స్థ లంలోని నాగమ్మ ఆలయం పేరును ఎంచుకోవా లని కోరుతున్నారు. ఖానాపూర్ మాజీ ఎంపీపీ డాక్టర్ జగన్నాథరావు కాలువ మరమ్మతుల్లో పాత్ర పోషించారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు కూడా ప్రతిపాదించారు.
మార్పు చేస్తామని..
స్థానిక డిమాండ్ల మేరకు ప్రాజెక్టు పేర్లు నిర్ణయిస్తామని అధికార పార్టీ స్పష్టం చేసింది. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జుపటేల్ స్వర్ణ ప్రాజెక్టుకు నర్సారెడ్డి పేరు పెడతామని, సదర్మాట్‌కు ప్రత్యామ్నాయం పరిశీలిస్తామని ప్రకటించారు. మండల నాయకులు పార్టీ బాసులకు ఇప్పటికే విషయం తెలిపారు.
పొన్కల్ గోదావరి నది వద్ద బ్యారేజీ సూచిక బోర్డు
జేఏసీ ఏర్పాట్లు..
మామడ: గోదావరిపై నిర్మించిన సదర్మట్ బ్యారేజీ పేరు మార్చాలని పొన్కల్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బ్యారేజీ నిర్మాణంలో పొన్కల్, ఆదర్శనగర్, కమల్‌కోట్ గ్రామాల రైతులకు చెందిన 805 ఎకరాల వ్యవసాయ భూమి ముంపుకు గురైంది. భూములతోపాటు ఈ గ్రామాలకు చెందిన ఆరాధ్య నాగదేవత ఆలయం ముంపునకు గురైంది. బ్యారేజీ కింద ఖానాపూర్, కడెం మండలాలకు చెందిన పంట భూములకు సాగునీరు అందించేందుకు తమ భూములను త్యాగం చేశామని బ్యారేజీకి పొన్కల్ నాగదేవత బ్యారేజీగా నామకరణం చేయాలని కలెక్టర్‌కు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు వినత్రిపత్రాలు అందించారు. పేరు మార్చేవరకూ పోటారం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.
ప్రాజెక్టుల పేరు మార్చాలె..!
ప్రాజెక్టుల పేరు మార్చాలె..!
ప్రాజెక్టుల పేరు మార్చాలె..!


