ఉ(ఎ)త్తి పోతలేనా?
నిధులు విడుదలైనా లిఫ్ట్ మరమ్మతులకు కలగని మోక్షం టెండర్లకు ముందుకురాని కాంట్రాక్టర్లు ఆందోళనలో ఆయకట్టు రైతులు
సారంగపూర్: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది. మండలంలో ఆలూరు, బీరవెల్లి గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి. నిర్వహణ లేక 8 ఏళ్లుగా వృథాగా ఉన్నలిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం నిదులు విడుదల చేసింది. దీంతో రైతుల్లో సంతోషం కనిపించింది. కానీ మరమ్మతులకు కాంట్రాక్టులు ముందుక రావడం లేదు. దీంతో అన్నదాత ఆశలు ఆవిర్యాయి. 750 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది.
సెప్టెంబర్‌లో నిధులు...
గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బీరవెల్లి పథకానికి రూ.69.10 లక్షలు, ఆలూరు పథకానికి రూ.32.50 లక్షలు కేటాయించింది. ఈ నిధుల విడుదలతో ఆయకట్టు రైతుల్లో యాసంగి పంగల సాగుపై ఆశలు చిగురించాయి. సీజన్ నాటికి మరమ్మతుల పూర్తవుతాయని భావించారు. అయితే మరమ్మతులకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు స్పందించకపోవడంతో పనులు మొదలు కాలేదు. దీంతో ఈ యంసగి ఆశలు కూడా ఆవిరయ్యాయి.
మరమ్మతులు చేస్తే ఆయకట్టు స్థిరీకరణ..
స్వర్ణనదిపై గత ప్రభుత్వం చెక్‌డ్యాంలు నిర్మించింది. దీంతో నీటి నిల్వలు పెరిగాయి. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రెండు పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉంది. లిఫ్ట్‌లకు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తెస్తే 750 ఎకరాలకు స్థిరమైన సాగునీరు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం టెండర్లు పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేలా చూడాలని కోరుతున్నారు.
పునరుద్ధరిస్తే మేలు
కొన్నేళ్లుగా ఆలూరు ఎత్తిపోతల పథకం పనిచేయక చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. బోరుబావులున్న రైతులకు డబ్బులు చెల్లించి సాగునీరు వినియోగించుకుంటన్నారు. అధికారులు స్పందించి ఎత్తిపోతలు పునరుద్ధరిస్తే చాలామేలు కలుగుతుంది.
– రవి, రైతు, ఆలూరు
సాగునీటి సమస్య తీరుతుంది..
ఎత్తిపోతల ద్వారా దాదాపు 300 ఎకరాల వరకు భూమలకు సాగునీరందుతుంది. అయితే బీరవెల్లి ఎత్తిపోతల పథకం 8 ఏళ్ల నుండి అలంకారప్రాయమే అయ్యింది. పాలకులు దృష్టిసారించకపోవడంతో ఆయకట్టు రైతుల సాగునీటి సమస్య తీరుతుంది.
– ఇస్మాయిల్, బీరవెల్లి
కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు..
ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నుంచి నేటికి మూడుసార్లు టెండర్లు పిలిచాం. అయినా కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదు. పనులు చేపట్టలేకపోతున్నాం. టెండర్లు పూర్తయితే పనులను చేపట్టి ఆయకట్టుకు సాగునీరందిస్తాం. రైతుల కష్టాలు తీరుస్తాం.
–మధుపాల్, ఏఈ, స్వర్ణప్రాజెక్టు
ఉ(ఎ)త్తి పోతలేనా?
ఉ(ఎ)త్తి పోతలేనా?
ఉ(ఎ)త్తి పోతలేనా?


