మురుగు గోదావరి
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో శ్రీజ్ఞాన సరస్వతీ దర్శనానికి వచ్చే భక్తులు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడం ఆనవాయితీ. భక్తులు గోదావరిని పరమ పవిత్రంగా భావిస్తారు. నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని, రోగాలు రావని నమ్ముతారు. కానీ, బాసర వద్ద గోదావరిలో స్నానం చేస్తే పాపాల మాట దేవుడెరుగు కానీ, రోగాలు ఖాయం. డ్రెయినేజీ నీటికన్నా అధ్వానంగా నది నీరు దుర్వాసన వస్తోంది. వసంత పంచమి సందర్భంగా వచ్చిన వేలాది మంది భక్తులు ముక్కు మూసకుని స్నానం చేశారు. ఇక చెత్త, చెదారం, వ్యర్థాలు స్నానఘట్టాలపైనే ఉన్నాయి. ఈ నీటిలో స్నానం చేయడానికి కొందరు భయపడి నెత్తిన చల్లుకున్నారు. కొందరు పక్కనే ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానం చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ నిర్మల్
మురుగు గోదావరి
మురుగు గోదావరి


