శిశుమందిరాలు విలువలతో కూడిన విద్యాలయాలు
నిర్మల్‌చైన్‌గేట్: భావిభారత పౌరులకు చదువులతల్లి ఒడిలోనే విద్యతోపాటు.. సమగ్రవికాసాన్ని బోధించే పాఠశాలలు శ్రీసరస్వతీ శిశుమందిరాలని కమలానంద భారతి స్వామీజీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాగులవాడ శ్రీసరస్వతీ శిశు మందిరంలో శుక్రవారం అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిశు మందిరాలలో కేవలం చదువుకే పరిమి తం కాకుండా.. ఒక వ్యక్తిగా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి, ప్రముఖ వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి, డాక్టర్ నాగరంజని, డాక్టర్ రామకృష్ణ, నార్లపురం రవీందర్, రావుల సూర్యనారాయణ, కడార్ల రవీంద్ర, పాఠశాల పూర్వ విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు.


