జంతు గణనను పరిశీలించిన డీఎఫ్‌వో
సారంగపూర్: మండలంలోని కౌట్ల(బి) సెక్షన్ పరిధి లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు గ ణనను జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్ గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా అధికా రులు ఇప్పటి వరకు చేపట్టిన జంతుగణన వివరాల ను డీఆర్వో నజీర్‌ఖాన్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే అడవిలో ఉన్న జీవజాతుల వివరాలు ఆరాతీశారు. ఇప్పటి వరకు ఎన్నిరకాల జంతువులు తారసపడ్డాయోనని అడిగి తెలుసుకున్నారు. గణన పక్కాగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అలాగే అడవుల పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. వన్యప్రాణులను వేటాడేవారిని విడిచిపెట్టవద్దని, వేటాడితే వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అటవీ సంరక్షణ చర్యలు, వణ్యప్రాణి సంరక్షణ చట్టాలను వివరించారు. డీఎఫ్‌వో వెంట ఎఫ్‌ఆర్వో రామకృష్ణారావు, ఎఫ్‌బీవో వెన్నెల, సిబ్బంది ఉన్నారు.


