టైగర్స్ ట్రోఫీ విజేత ‘ఏఆర్ హెడ్ క్వార్టర్స్’
నిర్మల్‌చైన్‌గేట్: పని ఒత్తిడిని తగ్గించి, శారీరక, మా నసిక ఉత్సాహాన్ని పెంచాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘నిర్మల్ పోలీస్ టైగర్స్ ట్రోఫీ’ క్రికెట్ టోర్నమెంట్ పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో రెండురోజులపాటు ఆహ్లాదకరంగా సాగింది. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో ఫైనల్ మ్యాచ్‌లో భైంసా సబ్ డివిజన్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జట్ల మధ్య జరిగిన పోరులో ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌జట్టు విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకోగా, ఎస్పీ జానకీ షర్మిల ట్రోఫీని ప్రదానం చేశారు. భైంసా, నిర్మల్ ఏఎస్పీ లు రాజేశ్‌మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, సీఐ లు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్‌రావ్, రామకృష్ణ, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు ఉన్నారు.


