గెలిచే నాయకులకే ప్రాధాన్యత
భైంసాటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న నాయకులకే అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. పట్టణంలోని ఎస్‌ఎస్ కాటన్ ఫ్యాక్టరీలో బుధవారం బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మా ట్లాడారు. పార్టీ ఎవరికి టికెట్లు ఖరారు చేయలేదని, టికెట్ రానివారు నిరాశ చెందకుండా పా ర్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం 70మంది ఆశావహులు పార్టీ ఎన్ని కల ఇన్‌చార్జి అడ్లూరి శ్రీనివాస్‌కు దరఖాస్తులు అందజేశారు. మరో రెండు రోజులపాటు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ చిన్నారెడ్డి, కో కన్వీనర్ రవి పాండే, నాయకులు నారాయణ్‌రెడ్డి, గంగాధర్, రాము తదితరులున్నారు.


