మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రూ.25 వేల పరికరాలు విరాళం
నిర్మల్ రూరల్: మండలంలోని సిర్గాపూర్‌కు చెందిన శాంతా ఫౌండేషన్ సభ్యులు నిర్మల్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి రూ.25 వేల విలుౖ వెన వైద్య పరికరాలను శనివారం విరాళంగా అందజేశారు. ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు మాధవీలత, విజయ్‌కుమార్ రెండు ఫీటల్ డాఫ్టర్లు, ఒక మల్టీ పారామీటర్ మానిటర్ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ సరోజ, సీఎస్‌ఎంఆర్‌వో డాక్టర్ రమేశ్‌కు అందించారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు ఈ పరికరాల ద్వారా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఇందులో వైద్యులు గోపాల్‌సింగ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వనాథ్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు.


