
అదుపుతప్పి లారీ బోల్తా
నర్సాపూర్ (జి): మండలంలోని చాక్‌పల్లి గ్రా మ శివారు 61వ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని జింతూ ర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లికి సో యా పొట్టుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రో డ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచాయి. సమాచారం అందుకున్న ఎస్సై గణేశ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీతో లారీని పక్కకు జరిపించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. లారీ డ్రైవర్‌కు గాయాలు కాగా 108లో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు.