
నిర్మల్
న్యూస్‌రీల్
జిల్లాలో 22,233 కొత్త కార్డులు
సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం
లబ్ధిదారులకు చేతిసంచి ఉచితం
ఫలించబోతున్న పదకొండేళ్ల కల
పర్యావరణహితాయ..
గణేశ్ నవరాత్రోత్సవాల కోసం వినాయక ప్రతిమలు సిద్ధమవుతున్నాయి. మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతుండగా వివిధ ఆకృతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి.
ఫిర్యాదులపై స్పందించాలి
నిర్మల్ టౌన్: ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధి కారులు, సిబ్బందితో జూమ్ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫి ర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కీలక సూచనలు చేశా రు. పెండింగ్ కేసులు త్వరగా పూర్తి చేయాలని, పోక్సో కేసుల్లో వీలైనంత త్వరగా కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు. గణేశ్ మండపాల నిర్వాహకులు అనుమతి కోసం త ప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని, అనుమతిపత్రం, క్యూఆర్ కోడ్‌ను మండపం వద్ద తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భైంసా, నిర్మల్ ఏఎస్పీలు అవినాష్, రాజేశ్‌మీనా, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్: రేషన్ కార్డుల కోసం 11ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరింది. జూలై 14న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్ చేతుల మీదుగా కార్డులు అందించారు. దీంతో వారి మోముల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కార్డుదారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీకి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జూన్‌లో మూడు నెల ల రేషన్ బియ్యం లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేశారు. దీంతోపాటు మూడు నెలలుగా ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీతోపాటు ఉన్న కార్డుల్లో సభ్యుల పేర్లు నమోదు చేసింది. జిల్లాలో పెరిగిన ఆహారభద్రత కార్డుల్లోని సభ్యుల సంఖ్యకు అనుగుణంగా సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అదనంగా 328 మెట్రిక్ టన్నులు
కొత్త రేషన్‌కార్డుదారులకు బియ్యం పంపిణీకి అధి కారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యథావిధిగా పాత కార్డులతోపాటు కొత్త కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాకు సెప్టెంబర్ కోటాకు సంబంధించిన సన్నబియ్యం కేటాయించారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం త రలింపునకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చౌకధర ల దుకాణాలు, మండలస్థాయి గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యానికి తోడు అదనంగా కావాల్సిన కోటా ను సరఫరా చేస్తున్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి ముందు ప్రతినెలా సుమారు 412 షాపుల ద్వా రా 2,19,972 కార్డులకు 4,428 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. పెరిగిన లబ్ధిదారు ల సంఖ్యకు అనుగుణంగా ప్రస్తుతం అదనంగా జిల్లాకు 328 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు.
నాలుగు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా
నిర్మల్, ముధోల్, భైంసా, ఖానాపూర్ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి 18మండలాల్లోని 412రేషన్‌షాపులకు బియ్యం కోటా చేరనుంది. స్టేజ్–1 గోదాము ల నుంచి ఇప్పటికే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బి య్యం నిల్వల రాక ప్రారంభమైంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి నేరుగా రేషన్‌షాపులకు బియ్యం పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లా రేషన్ సమాచారం
పాత కార్డులు 2,19,972
యూనిట్లు 7,03,796
కొత్త కార్డులు 22,233
కొత్త యూనిట్లు 50,727
మొత్తం కార్డులు 2,42,205
మొత్తం యూనిట్లు 7,54,523
గత కోటా 4,428 మెట్రిక్ టన్నులు
పెరిగిన కోటా 328 మెట్రిక్ టన్నులు
సెప్టెంబర్ కోటా 4,756 మెట్రిక్ టన్నులు

నిర్మల్

నిర్మల్