
ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న సీఆర్పీఎఫ్ బలగాలు
నర్సాపూర్( జి): ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని 99–ఎఫ్ సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్లు అమర్‌కుమార్‌శర్మ, కై లాష్‌చందు, ఎస్సై హన్మాండ్లు సూచించారు. మండల కేంద్రంలో శుక్రవారం సీఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది మహేందర్, రమేశ్, కృష్ణ, శ్రీనివాస్, షహీద్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణచాందకు చేరిన
ఎస్సారెస్పీ నీళ్లు
లక్ష్మణచాంద: కొద్ది రోజులుగా మండలంలోని సరస్వతి కాలువకు నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. రైతుల విజ్ఞప్తి మే రకు గురువారం సాయంత్రం అధికారులు ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో శుక్రవారం ఉదయం వరకు మండలానికి నీళ్లు చేరాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.