
గువాహటి: ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్‌గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో ఆయన సమీప బంధువు, పోలీస్ డీఎస్పీ సందీపన్‌గార్గ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదుచేసినట్లు సీఐడీ డీజీపీ మున్నాప్రసాద్ గుప్తా తెలిపారు. సందీపన్‌ను కామపుర మెట్రోపాలిటన్ జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజి్రస్టేట్ (సీజేఎం) ముందు హాజరుపర్చగా, ఆయనకు న్యాయమూర్తి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్టు మున్నాప్రసాద్ వెల్లడించారు.
సందీపన్‌తో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మతోపాటు జుబీన్ మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు శేఖర్‌జ్యోతి గోస్వామి, అమృత్‌ప్రభ మహంతను అరెస్టు చేశారు. జుబీన్ సింగపూర్‌లో గత నెల 19న సముద్రంలో మునిగి మరణించిన సమయంలో ఈ ఐదుగురు అక్కడే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 2022లో అస్సాం పబ్లిక్ సరీ్వస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన సందీపన్‌గార్గ్.. ఈడబ్ల్యూఎస్ కోటాలో డీఎస్పీగా
ఎంపికయ్యారు.