న్యాయస్థానంపై తీవ్రవ్యాఖ్యలు.. యూట్యూబర్‌ శంకర్‌కు 6 నెలల జైలు 

Youtuber Savuku Shankar gets 6 month jail for Contempt - Sakshi

సాక్షి, చెన్నై: యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు ఎస్‌. శంకర్‌కు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది. రెండు నెలల క్రితం తన ఛానల్‌లో న్యాయ మూర్తులు, న్యాయవర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ శంకర్‌ ఓ వీడియో విడుదల చేశారు. న్యాయశాఖ అవినీతి మయమైందని అందులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కథనాన్ని మధురై ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారించి, నిందితుడికి 6 నెలల జైలు శిక్ష విధించింది.  

చదవండి: (మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top