పరిహారం కోసం సీఎం ఇంటికి పాదయాత్ర..

Women Victims Go To The Karnataka CM House For Compensation - Sakshi

యశవంతపుర: గర్భకోశం తొలగించిన మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం వైద్యుల అలసత్వం వల్ల ఖజానాకు తిరిగి వెళ్లిపోయింది. ఈ మహిళలకు సాయం చేయాలని హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా ఆస్పత్రికి భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. గర్భకోశం తొలగించుకున్నవారికి ఆస్పత్రిలోనే చెక్కు రూపంలో అందించాలి. కానీ వైద్యులు ఎవరికీ ఆర్థిక సాయాన్ని అందించలేదు.

నిధులను వాడుకోకపోవడంతో సర్కారుకి తిరిగివెళ్లాయి. దీంతో బాధిత మహిళలు శిగ్గావిలోని సీఎం బసవరాజ్‌ బొమ్మై ఇంటికి పాదయాత్రగా బయల్దేరారు. 8 ఏళ్ల నుంచి 1522 మంది మహిళలకు గర్భకోశం తొలగించారు. వారందరికీ మొండిచెయ్యి చూపారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌ శాంతపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్‌ చేశారు.  

(చదవండి:  పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top