యువతిని ఎత్తుకెళ్లి.. ఎడారిలో రాక్షస వివాహం | Woman Forcibly Married By Kidnapper In Jaisalmer | Sakshi
Sakshi News home page

వీడియో: యువతిని ఎత్తుకెళ్లి.. ఎడారిలో రాక్షస వివాహం.. చివరకు..

Jun 7 2023 9:28 PM | Updated on Jun 7 2023 9:41 PM

Woman Forcibly Married By Kidnapper In Jaisalmer - Sakshi

యువతితో తన నిశ్చితార్థాన్ని ఆమె కుటుంబ సభ్యులే రద్దు చేశారన్న కోపంతో ఆమెను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడో యువకుడు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఈ ఘటన జరిగింది. 

బాధిత యువతితో నిందితుడు పుష్పందర్ సింగ్‌కు నిశ్చితార్థం కుదిరింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు దాన్ని రద్దు చేశారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు తన స్నేహితులతో కలిసి జూన్‌ 1న యువతిని ఎడారిలోకి ఎత్తుకెళ్లాడు. ఆమె ఏడుస్తున్నా.. పెళ్లి చేసుకున్నాడు. (హిందు సంప్రదాయం ప్రకారం) ఆ మంట చుట్టూ ఏడుసార్లు తిరిగాడు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి.

అయితే.. యువతిని అదే రోజు రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముగ్గుర్ని అరెస్టు చేయగా.. ఒకరిని నిర్బంధంలోకి తీసుకున్నారు.మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్.. చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను షేర్ చేసి.. 'ఇది నిజంగా భయానక ఘటన. యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నారు.దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం'అని ఆమె పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: ఒడిశాలో దారుణం.. ఈదురుగాలులకు కదిలిన బోగీలు.. నలుగురు మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement