వీడియో: చెయ్యికి పాము చుట్టినా.. భక్తిపారవశ్యంతో చిందులు

Woman Devotee Dance After Snake Wrap Her Hand Video Viral - Sakshi

వైరల్‌: దేవుడిపై భక్తి, నమ్మకం ఉండాలి. కానీ, అది గుడ్డిగా ఉండకూడదు!. భక్తి పేరుతో మూఢనమ్మకాలను ప్రమోట్‌ చేయడం, అంధ విశ్వాసంతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ చూస్తున్నాం కూడా. అయితే.. తాజాగా మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌ బార్డర్‌లోని ఓ గ్రామంలో జరిగిన ఆసక్తికర ఘటన ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 

చిన్‌ద్వారా జిల్లా జామ్‌ సవాలీ హనుమాన్‌ ఆలయం.. ఆ చుట్టుపక్కల 11 జిల్లాల్లో బాగా ఫేమస్‌. ఎందుకంటే ఆ ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకుని ఉన్న పొజిషన్‌లో ఉంటుంది. సంజీవని పర్వతం మోసుకెళ్లే సమయంలో.. ఆయన అక్కడ సేదతీరాడని నమ్మకం. అంతేకాదు విగ్రహ నాభి నుంచి నీరు ఉబికి వస్తుంటుంది. ఆ నీటిని తీర్థంలా స్వీకరిస్తే.. మానసిక జబ్బులు తగ్గిపోవడంతో పాటు దెయ్యాలు, దుష్టశక్తులు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉదయం, సాయంత్రం మహా హారతి వేళ అలాంటి భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంటుంది. 

అయితే.. తాజాగా హోలీ పండుగ సందర్భంగా ఈ ఆలయంలో ఒక ఘటన జరిగింది. హరతి సమయంలో భక్తులు హనుమాన్‌ చాలీసా పఠిస్తుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ నాగుపాము ఒక భక్తురాలి చేతికి చుట్టుకుంది. అయితే ఆ పరిణామంతో ఆమె బెదరలేదు. పైగా ఆ పాము అలా ఉండగానే పైకి లేచింది. భక్తిపారవశ్యంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ చిందులేసింది. అది చూసి భయంతో కొందరు దూరం జరిగారు. మరికొందరు స్వామివారి నినాదాలు చేస్తూ ఊగిపోయారు. అదేం విచిత్రమో.. ఆ పాము కూడా ఆమెను ఏం చేయలేదు. కాసేపటికి చెయ్యి నుంచి దిగిపోయి.. తన మానానా తాను బయటకు వెళ్లిపోయింది. ఈ ఆలయంలో ఈ తరహా అద్భుతాలు తరచూ జరుగుతుంటాయని, అంతా స్వామివారి మహిహేనని ఆలయ ప్రధాన అర్చకుడు చెప్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top