బాస్కెట్‌ బాల్‌ ఆడి ఆశ్చర్యపరిచిన ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌

Wheelchair Bound Pragya Thakur Playing Basketball In Bhopal - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ బాస్కెట్‌ బాల్‌ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.  పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సాధారణంగా ఎక్కడ కు వెళ్లినా వీల్ చైర్లో కూర్చుని ఉంటారు. గురువారం భోపాల్‌లోని సాకేత్‌ నగర్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఠాకూర్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడకి దగ్గరలో కొంతమంది ఆటగాళ్ళు బాస్కెట్‌బాల్  ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లను చూసి ఆమె అక్కడికి వెళ్లి వాళ్లతో ఆడాలని నిశ్చయించుకుంది. దీంతో  బాస్కెట్‌ బాల్‌ తీసుకుని కొంతసేపు డ్రిబ్లింగ్ చేసి విజయవంతంగా నెట్‌లోకి విసిరారు. ప్రగ్యా సింగ్‌ బాస్కెట్‌బాల్ ఆడుతున్న వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పంచుకుంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా మాట్లాడుతూ.. ఎంపీ ప్రగ్యా సింగ్‌  ఠాకూర్ ను వీల్‌చైర్‌లోనే  నేను ఇప్పటివరకు చూశాను, కానీ ఈ రోజు స్టేడియంలో బాస్కెట్‌బాల్‌ ఆడుతూ  చూడటం చాలా  ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ విషయంపై  ప్రగ్యా సింగ్‌ సోదరి స్పందిస్తూ ఆమె శారీరక విద్య (సిపిఇడి), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బిపిఇడి) లో సర్టిఫికేట్ కోర్సు చేశారని..జైలుకు వెళ్లేముందు ఆమె ఆరోగ్యంగా  చక్కగా ఉందని, అక్కడ ఆమెను హింసించారని ఆమె ఆవేదన చెందింది.  ప్రగ్యా సింగ్ ఠాకూర్ 2008 మాలెగావ్ పేలుడు కేసులో నిందితరాలు. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జనవరి లో ఆమెకు ఎన్‌ఐఏ  కోర్టు కేసు నుంచి మినహాయింపు ఇచ్చింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top