బెల్టుకు 35 వేలా అని తిట్టారు.. మరి ఇదేంటి ‘దేశీ మామ్‌’!

Viral: Woman Who Roasted Daughter For Rs 35k Belt Wear With Saree - Sakshi

‘‘ఏంటీ.. ఈ బెల్టుకు 35 వేల రూపాయలా? అంతగా ఏముంది దీంట్లో.. స్కూలు బెల్టులా ఉంది. దీని మీద జీజీ అని ఎందుకు రాశారు. మార్కెట్లో 150 రూపాయలకే దొరుకుతుంది. డబ్బు వృథాగా ఖర్చు పెట్టేందుకే మీరంతా ఉన్నారు’’.. ఈ మాటలు అన్న ‘దేశీ మామ్‌’ అనితా గుప్తా గుర్తున్నారా? అదేనండీ.. తన కూతురు, సోషల్‌ మీడియా యూజర్‌ చాబి గుప్తా బ్రాండెడ్‌ బెల్టు కొన్నానని చెప్పినందుకు చివాట్లు పెట్టారే ఆవిడే. తన ఫన్నీ కామెంట్లతో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన అనితా గుప్తా.. ఇప్పుడు మరోసారి వార్తలోకెక్కారు.

ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బెల్టును జార్ఖండ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూలు బెల్టుతో పోల్చిన ఆమె.. ఇప్పుడు అదే బెల్టును ధరించి ఎంచక్కా ఫొటోలకు ఫోజులిచ్చారు. సంప్రదాయ చీరకట్టుకు బెల్టును జతచేసి మోడ్రన్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. తన తల్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన చాబి.. ‘‘గుచీ బెల్టును ఇలా భారతీయ సంప్రదాయ చీరకట్టుతో జతచేసి ధరించడం.. ఇదొక స్టైల్‌’’ అని పేర్కొంది. గోరంచు ఉన్న గులాబీ రంగు చీరకు... పూర్తిగా వర్క్‌తో నిండిన బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసి చిరునవ్వులు చిందిస్తున్న అనితా గుప్తా ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో... ‘‘ఆంటీ.. ఇది ఆ 150 రూపాయల బెల్టు అయితే కాదు కదా. లేదంటే.. అంత ఖర్చు పెట్టి కొన్నందుకు ఎడాపెడా వాడేద్దామని డిసైడ్‌ అయ్యారా? ఏదైమేనా చాలా అందంగా కనిపిస్తున్నారు దేశీ మామ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top