కొత్త కారుతో గ్రాండ్‌ ఎంట్రీ .... పల్టీ కొట్టిందిగా!

Viral Video: Unfortunate Accident Involving Brand New Car  - Sakshi

ఒక వ్యక్తి కొత్త కారుతో గ్రాండ్‌గా ఎంటీ ఇస్తున్నాడు. కానీ అతనికి కొత్త కారుతో వచ్చిన ఆనందం కాస్త చేదు అనుభవాన్ని మిగిల్చింది. బ్రాండెడ్‌ టాటా నెక్సాన్‌ కారుతో చక్కటి పూల దండతో అలకరింపబడి ఉన్న కారుతో ఇంటికి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఐతే సెక్యూరిటీ గార్డు కూడా గేట్‌ తీసి చక్కగా దారి ఇచ్చాడు కూడా. కానీ సదరు వ్యక్తి కారుని లోపలి పోనిచ్చి పక్కనే పార్క్‌ చేసిన బైక్‌లపైకి పోనిచ్చాడు.

దీంతో కారు ఆ బైక్‌లన్నింటిని ఢీ కొడుతూ ఒక పక్కకు పల్టీ కొట్టబోయింది. ఇంతలో సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సదరు కారు నడుపుతున్న వ్యక్తికి సాయం అందిస్తాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని  వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

(చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు)

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top