వైరల్‌: కూరగాయలు ఇలా కూడా అమ్ముతారా?! | Viral Video Jharkhand Vegetable Vendor Attract Customers In New Style | Sakshi
Sakshi News home page

వైరల్‌: నా రూటే సపరేటు అన్నట్లు..!

Mar 23 2021 6:41 PM | Updated on Mar 23 2021 7:02 PM

Viral Video Jharkhand Vegetable Vendor Attract Customers In New Style - Sakshi

ఏ పని చేసినా అందులో తమదైన ముద్ర ఉండాలని భావిస్తారు కొంతమంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి రితేశ్‌ పాండే కూడా అలాంటి వాడే. తొలుత అందరిలాగే తానూ కూరగాయలు అమ్మిన రితేశ్‌, కస్టమర్లను ఆకర్షించేందుకు తనలోని కళను బయటికి తీశాడు. తన వద్దనున్న టేప్‌రికార్డర్‌లో సల్మాన్‌ ఖాన్‌ పాటను ప్లే చేస్తూ, డ్యాన్స్‌ చేస్తూ కొనుగోలుదారులను తన బండి వద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఇక తలపాగా చుట్టుకుని, కళ్లకు సన్‌గ్లాసెస్‌ పెట్టుకుని.."ఆజావో భాయ్‌ సబ్జీ లేలో(రండి.. వచ్చి కూరగాయలు తీసుకువెళ్లండి)..’’(దబాంగ్‌ సినిమాలోని పాట) అంటూ జోష్‌గా స్టెప్పులేస్తున్న రితేశ్‌ బాటసారులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రేరణ శర్మ అనే ట్విటర్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘కూరగాయలు.. కూరగాయలు.. అంటూ అందరిలా సొంత గొంతుతో రాగయుక్తంగా పాడటమో లేదా, మైక్‌లో రికార్డెడ్‌ వాయిస్‌ను ప్లే చేస్తూ చిరాకు తెప్పించడమో చేయకుండా, మీలోని కళను బయటపెడుతూ.. కొత్త స్టైల్‌లో వ్యాపారం చేస్తున్న మీకు అంతా మంచే జరగాలి’’ అని విషెస్‌ చెబుతున్నారు.

చదవండి: వైరల్‌: జాగ్రత్తపడకపోతే మనకు ఇదే గతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement