Viral Video: అరవింద్‌ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్‌ అమ్ముతూ..

Viral Video: Chaat Seller Also Seen Wearing Arvind Kejriwals Iconic Cap - Sakshi

మనుషులను పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని ఆర్యోక్తి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి,  ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ని పోలిన మరో వ్యక్తి చాట్‌ అమ్ముతూ కనిపించాడు. మద్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో కేజ్రీవాల్‌లా క్యాప్‌ ధరించి, ఆయన మాదిరి వేషధారణలో ఉన్నాడు. చూస్తే అరవింద్‌ కేజ్రీవాలే అని అనుకుంటారు. 

అంతలా ఉంది అతని వేషధారణ. అతను ఒక బిజీ రోడ్డుపై చాట్‌బండితో కనిపించాడు. తన మెనుని అక్కడే ఉన్న చెట్టుకి వేలాడదీశాడు. పైగా అతని వద్ద సమోసా, చాట్‌, గులాబ్‌ జామ్‌ వంటి అన్ని రకాల స్నాక్‌​ ఐటమ్స్‌ ఉన్నాయి. పైగా వాటి ధర కేవలం రూ. 10 నుంచి మొదలై రూ. 30 వరకు మాత్రమే ఉంది. తాను నాణ్యతను నమ్ముతానని, తన దగ్గర మంచి నాణ్యతతో లభించే ఆహార పదార్థాలే ఉంటాయని, ఇలాంటివి మరెక్కడ ఉండవని చెబుతున్నాడు.

ఈ మేరకు విశాల్‌ శర్మ అనే ఫుడ్‌ బ్లాగర్‌ గాల్వియర్‌లో చాట్‌ అమ్ముతున్న కేజ్రీవాల్‌ అనే క్యాప్షన్‌ జోడించి మరీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్‌ చేశాడు. అంతేగాదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఢిల్లీలో అన్ని ఉచితంగా ఇస్తే, ఈయన నాణ్యతను నమ్మతారు కాబోలు అని వీడియోలో చమత్కరించాడు. దీంతో నెటిజన్లు బహుశా అతని వ్యాపారానికి ప్రభుత్వ లైసెన్సు లభించొచ్చు అని ఒకరూ, చాలా తక్కువ ధరలో మంచి స్నాక్స్‌ అందిస్తున్నాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

(చదవండి: వీడియో: బెంజ్‌ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి)

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top