విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు | Vijay Mallya Contempt Case to be Dealt With Finally On 18th January | Sakshi
Sakshi News home page

విజయ్‌ మాల్యా కోర్టు ధిక్కరణ కేసు.. ఆ రోజే తుది తీర్పు

Dec 1 2021 7:52 AM | Updated on Dec 1 2021 7:52 AM

Vijay Mallya Contempt Case to be Dealt With Finally On 18th January - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులను రూ.9,000 కోట్ల మేర మోసగించి, విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా భాగస్వామిగా ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో వచ్చే ఏడాది జనవరి 18న తుది తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం ప్రకటించింది.  మాల్యా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి విదేశాల్లో ఉన్న తన పిల్లలకు 40 మిలియన్‌ డాలర్లు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆయనను 2017లో దోషిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది.

చదవండి: (‘370’ రద్దు తర్వాత స్వస్థలాలకు 1,678 మంది కశ్మీరీలు)

ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే తగినంత సమయం వేచి చూశామని, ఇంకా వేచి ఉండలేమని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. యూకేలో ఉంటున్న విజయ్‌ మాల్యాను భారత్‌కు రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 

చదవండి: (చంపేస్తామని బెదిరిస్తున్నారు: కంగనా రనౌత్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement