Viral Video: జస్ట్‌ మిస్‌.. క్షణం ఆలస్యం అయ్యుంటే ఎంత ఘోరం జరిగుండేదో

Video: School Student Narrowly Escapes From Snake Bite At Kerala - Sakshi

సాధారణంగా పాములను చూస్తే ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటి పాములు ఈ మధ్యకాలంలో జనావాసాల్లోకి ఎగబడుతున్నాయి. రోడ్లు, ఇళ్లు, బస్సు.. ఇలా ఎక్కడ చూసినా అనుకోని అతిథుల్లా ప్రత్యక్షమవుతున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లోనూ ఎక్కువ శాతం పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇలా ప్రమాదకరమైన పాములు కంటపడటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. 

తాజాగా ఓ స్కూల్‌ విద్యార్థి సెకన్ల వ్యవధిలో పాము కాటు నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని  కొల్లా జిల్లాలోని కూన్నతుర్లో జరిగింది. స్కూల్‌ యూనిఫాం ధరించి ఉన్న ఓ విద్యార్తి ఇంటి ముందు ఉన్న గేట్‌ దగ్గర నిల్చొని ఉంటాడు. కొద్దిసేపటికి లోపలికి వచ్చి గేట్‌ మూసేస్తుండగా.. పక్కనే పాము ఉండటాన్ని గమనించాడు. పాముని చూసి భయంతో వెంటనే అడుగు ముందుకు వేయగా.. పాము ఒక్కసారిగా అతడిని కాటేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి లోపలికి పరుగెత్తుకెళ్లాడు. అనంతరం తన తల్లిని తీసుకొచ్చి పామును చూపిస్తుండగా అది మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. 
చదవండి: చాలా రిచ్‌.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. అబ్బాయి అదృష్టం బాగుంది. జస్ట్‌ మిస్‌.. క్షణం ఆలప్యం అయ్యుంటే పాము కాటుకు గురయ్యేవాడు. ఈ మధ్య పాములు ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి’ అంటూ సూచిస్తున్నారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top